ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమింపజేసే అధికారం తమకు ఉందో,లేదో… సమ్మె అక్రమమని తాము ప్రకటించవచ్చో లేదో పరిశీలిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీ సమ్మెపై వాదోపవాదనలు జరుగుతున్న సమయంలో… ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేలా ఆదేశించమని ప్రభుత్వం కోరగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
గతంలో జూనియర్ డాక్టర్ల సమ్మె సమయంలో…ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమింపజేయాలని హైకోర్టు ఆదేశించినట్లు ప్రభుత్వం గుర్తు చేసింది.
ఇటీవల హైకోర్టు కోరిన విధంగా రూట్ల ప‌్రైవేటీకరణపై కేబినెట్ ఫైల్‌ను కోర్టుకు సమర్పించింది ప్రభుత్వం.