మే 15. ఇప్పుడు తెలంగాణలో చాలా సెక్షన్స్ ఈ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రయాణాలు చేసే వాళ్లు, ఉద్యోగులు, వివిధ రకాల బిజినెస్ చేసే వాళ్లు అంతా మే 15న సీఎం కేసీఆర్ ఎం చెప్పబోతున్నారన్న ఆసక్తి నెలకొంది.
మే 5న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మద్యం షాపులు ఒపెన్ చేయటం, లాక్ డౌన్ సడలింపులు ఇవ్వటంతో పాటు పనిలో పనిగా ప్రతిపక్ష పార్టీలపై ఓ రెంజ్ లో ఫైర్ అయ్యారు. కానీ బస్సు సర్వీసులు సహా రెడ్ జోన్లలో సడలింపులపై మే 15న నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. ఆ రోజు రివ్యూ చేసి, పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుందని ప్రకటించారు.
మే 15 రానే వచ్చింది. ఇప్పటికే రవాణా శాఖ అధికారులు డిపో మేనేజర్లతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ శుక్రవారం రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, గ్రీన్-ఆరెంజ్ జోన్లలో బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారు.
ఇక హైదరాబాద్ సహా జీహెచ్ఎంసీలో పరిస్థితుల నేపథ్యంలో… మరిన్ని సడలింపులు ఇవ్వాలా వద్దా…? అనే అంశాలపై రివ్యూ జరగనుంది. దీంతో జనం కేసీఆర్ మినహాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.