కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ చేయటం వల్ల ఎక్కడి జనాలు అక్కడే ఉంటున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్ర ప్రాంత జనాలు ఇబ్బందు లు పడుతున్నారని ఎవరి సొంత గ్రామాలకు వాళ్ళు సొంత వాహనాల లో వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ నుండి ఎక్కువగా అక్కడ హాస్టళ్లలో ఉండే జనాలకే ఆంధ్ర కి బయలుదేరారు.
అశ్వారావుపేట దగ్గర ఉన్న బోర్డర్ వద్ద ఆంధ్ర ప్రభుత్వం ఎవరిని తెలంగాణ నుండి రానివ్వట్లేద్దు. దాని వల్ల జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వందల సంఖ్య లో కార్లు ఆగిపోయాయి. ఒక్కో కార్ లో ఇద్దరు ఉన్న అనుమతి ఇవ్వట్లేదు. ఇక్కడ హోటల్స్ అన్ని బంద్ చేయటం వల్ల వాళ్ళకి తిండి లేకుండ ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్ర కి వెళ్లే ప్రతి చిన్న రహదారి నీ కూడా మూసేసారు. తెలంగాణా నుండి రనివట్లేదు. ఆంధ్ర లో కూడా తెలంగాణ కి కూడా ఎటువంటి వాహనానికి అనుమతి ఇవ్వట్లేదు. జనాలు రోడ్లు మీదే కాలం గడుపుతున్నారు. తెలంగాణ బోర్డుర్ లో నుండి ఆంధ్ర కి వెళ్ళటానికి అంతర్గత రోడ్లు కూడా మూసివేయడంతో బైకులు కార్లు భారీగా 5 కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. ఎటు వెళ్లాలో , ఏమి చెయ్యాలో తెలియక ఇబ్బంది లు పడుతున్నారు.