జనగాం జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభయాంజనేయ స్వామి ఆలయంలో దళితుడికి పూజలు చేయనని ఆలయ పూజారి వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. దీంతో గుడి వద్ద దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. రంగంలోకి పోలీసులు పూజారి అభయాంజనేయ శర్మను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దళిత వర్గానికి చెందిన భాస్కర్, సంధ్య దంపతులు తమ కుమారుడికి శాంతి పూజ చేయించేందుకు శుక్రవారం ఆలయానికి వచ్చారు. పూజ చేయాలని పూజారిని కోరగా.. దళిత వర్గానికి చెందినవారని తెలుసుకుని దళితులకు ఆలయంలో ప్రవేశం లేదని, పూజలు చేయమని పూజారి చెప్పడంతో ఆ దంపతులు వెనక్కి వచ్చారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. దళితులపై వివక్ష ఎందుకుని దళితులు ప్రశ్నించారు.
ఆలయం ఎదుట దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున గుమిగూడారు.