విజయవాడ గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య సవాళ్ల, ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా నగర వాతావరణం వేడెక్కింది. దేవినేని ఉమపై విమర్శలు చేసే క్రమంలో సహనం కోల్పోయిన కొడాలి నాని తాజాగా మాట జారారు. దేవినేని ఉమను ఇంటికి వచ్చి తంతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కొడాలి వ్యాఖ్యలపై దేవినేని ఉమ భగ్గుమన్నారు.
ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వస్తానని.. దమ్ముంటే వచ్చి టచ్ చెయ్యి అంటూ కొడాలి నానికి ప్రతిసవాల్ విసిరారు. ఆయన వచ్చేదాకా గొల్లపూడిలో ఉంటానని.. అక్కడే నిరసనకు కూడా సిద్ధమయ్యారు. దీంతో గొల్లపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సిటీ పరిధిలో ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని సీపీ స్పష్టం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా గొల్లపూడిలో భారీగా మోహరించారు.