సంక్రాంతి పండగ వేళ నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా ధర్నాలను చేపట్టాలని సామజిక మాధ్యమాల్లో ఓ మెసేజ్ వైరల్ అయింది. బుధవారం రాత్రి 8గంటలకు ధర్నాలకు సిద్ధమవ్వాలని మెసేజ్ లో పేర్కొన్నారు. ఈ సందేశం పోలీసులకు చేరడంతో నగరంలో ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావించారు. బహదూర్‌పురా, మసాబ్ ట్యాంక్, నెక్లెస్ రోడ్, ముసారాంబాగ్, కాచిగూడ క్రాస్ రోడ్స్, టోలిచౌకి ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.దీంతో ఎలాంటి పరిస్థితులైననా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎలాంటి ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు