గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఇర్కిచేడులో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు స్థానికంగా వివాదాస్పదమైంది. గ్రామకంఠం స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతోంది. అయితే.. అదే స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చూసింది ఓ వర్గం.
వివాదం జరుగుతున్న స్థలంలో విగ్రహం ఏర్పాటు చేయడానికి చూస్తారా అంటూ మరో వర్గం కోపంతో ఊగిపోయింది. విగ్రహప్రతిష్టను అడ్డుకుంది. ఈ క్రమంలో వాగ్వాదం చెలరేగింది. విషయం తెలిసి పోలీసులు ఎంటర్ అయ్యారు.
గొడవ పడుతున్న రెండు వర్గాలను సముదాయించేందుకు చూశారు పోలీసులు. అయినా కూడా వినిపించుకోకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూసింది ఓ వర్గం. దీంతో మరో వర్గం వారు అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
అయితే.. వెంటనే మంటలను ఆర్పేయడంతో విగ్రహానికి ఏం కాలేదు. పైన ఉన్న కవర్ మాత్రమే కాలింది. ఈక్రమంలో ఓ పోలీస్ అధికారికి కూడా నిప్పంటుకుంది. భారీగా బలగాలను మోహరించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.