ఓవైపు గిరిజన సంఘాల ఆందోళన.. మరోవైపు ప్రీతి బంధువుల నిరసనతో నిమ్స్ పరిసరాలు ఉద్రిక్త పరిస్థితులను తలపిస్తున్నాయి. ఇంకోవైపు రాజకీయ పార్టీలు కూడా ఎంట్రీ ఇవ్వడంతో పోలీసులు బలవంతంగా అందర్నీ తరలించే పనిలో ఉన్నారు.
ఒకానొక సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట కూడా జరిగింది. ఆస్పత్రిలోకి దూసుకెళ్లేందుకు కొందరు ప్రయత్నించారు. అంబులెన్స్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు కూడా చేరుకోవడంతో అరెస్టులకు దిగారు పోలీసులు.
అందర్నీ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలిస్తున్నారు. మరోవైపు తమ అమ్మాయి ఎలా చనిపోయిందో కేసు హిస్టరీ కావాలంటున్నారు ప్రీతి తండ్రి. సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి ఎలా చనిపోయిందో తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలని.. సత్వర న్యాయం జరగాలని ప్రీతి బంధువులు నినాదాలు చేశారు.