సకల జనుల సమరభేరికి హాజరై గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ బాబు మృతదేహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు ఎంపీ బండి సంజయ్, మందకృష్ణ మాదిగ, తెలంగాణాజనసమితీ నేత కొండరాం, సిపిఐ నేత చాడవెంకటరెడ్డి, మాజిఎమ్మెల్యె బొడిగె శోభ తదితరులు.
ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే వరకు డ్రైవర్ బాబు అంత్యక్రియలు నిర్వహించేది లేదని కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. దీంతో కరీంనగర్‌లోని బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించారు.
ఆర్టీసి జేఏసీ చలో కరీంనగర్ పిలుపునివ్వడంతో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికితోడు కరీంనగర్ టౌన్ బందుకు ప్రతిపక్షాలన్నీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సమస్య పరిష్కరించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నాయకులు తెలపటం తో కరీంనగర్ టెన్షన్ వాతావరణం నెలకొంది.