తిరుమల- అలిపిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి కోసం వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే సర్వదర్శనం టికెట్లను టీటీడీ నిలిపివేయడంతో భక్తులు అలిపిరిలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జాం అయింది. భక్తులను బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే చాలా దూరం నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చామని..తమకు టికెట్లు ఇచ్చేవరకూ అక్కడి నుంచి కదలమని వారు చెప్తున్నారు.
కాగా, సర్వదర్శనం టోకెన్లకు టీటీడీ తాత్కాలికంగా బ్రేక్ వేసింది. సోమవారం నుంచి జనవరి 2వ వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 24వ తేదీ వరకు సర్వదర్శనం టికెట్లను ఇప్పటికే జారీ చేయగా… డిసెంబర్ 24 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం స్థానికులకు మాత్రమే టికెన్లను ఇవ్వనుంది. ఈ విషయం తెలియక భక్తులు భారీగా తరలివచ్చి ఇక్కట్లు పడుతున్నారు.