వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికారుల ఆలోచన రాహిత్యం వల్ల ఎస్టీ కార్పొరేషన్ స్వయం ఉపాధి యూనిట్ల ఎంపిక గందరగోళంగా మారింది. తమకు సపరేటుగా యూనిట్లు ఏర్పాటు చేయాలని, యూనిట్ల ఎంపిక నిలిపివేయాలని కొందరు చెంచులు ఎంపిడిఓ కార్యాలయం ముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.దీంతో ఎస్టీ ధరఖాస్తుదారులకు,చెంచులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
చెంచులు కూడా ఎస్టీల్లో ఒకరని వారికి వేరుగా ఎలా డ్రా నిర్వహిస్తారని అధికారులను నిలదీశారు.మండలం మొత్తానికి 850 మంది దరఖాస్తు చేసుకోగా… 37 యూనిట్లు ఎంపిక చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన దరఖాస్తుదారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎంపిక కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ క్రమంలో ఎంపిక కోసం వచ్చినవారు ఎంపిడివో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎంపిక కోసం మరో తేది నిర్ణయించి ప్రకటిస్తారని చెప్పి అక్కడినుంచి అందరిని చెదరగొట్టి పంపించివేశారు.