ఏపీగా రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ నేడు జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు జేఏసీ ఆధ్వర్యంలో నేడు చినకాకని జాతీయ రహదారిపై నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచే టీడీపీ నేతలను, జేఏసీ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.
అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపును నిరసిస్తూ నేడు టీడీపీ ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంత పరిసరాల్లో పూర్తి టెన్షన్ వాతావరణం నెలకొంది. జాతీయ రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి వెళ్తున్నారని సమాచారంతో టీడీపీ ప్రచార కమిటీ కన్వీనర్ చిట్టాబత్తిన చిట్టిబాబును పోలీసులు ఉదయం 4గంటలకే హౌస్ అరెస్ట్ చేశారు.
ఇక మాజీ మంత్రి దేవినేనిని బయటికి రాకుండా అడ్డుకునేందుకు ఉదయం నుంచే ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌లను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.