బైంసాలో ఉద్రిక్త పరిస్థితులు - Tolivelugu

బైంసాలో ఉద్రిక్త పరిస్థితులు

నిర్మల్ జిల్లా బైంసాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు ఐదు బైకులకు నిప్పటించడంతో బైకులు పూర్తిగా దగ్దమయ్యాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీ చార్జీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల పైకి ఆందోళకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. బైంసాలో ఉద్రిక్త పరిస్థితులపై ఎస్పీ శశిధర్ రాజు సమీక్ష నిర్వహించారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp