వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు నిర్వహిస్తున్న ట్రాక్టర్ పరేడ్.. హింసాత్మకంగా మారింది. ముందుగా చెప్పిన సమయం, మార్గాల్లో కాకుండా ర్యాలీ నిర్వహణకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అనుమతి లేకపోయినా సెంట్రల్ ఢిల్లీలోకి రైతులు చొచ్చుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. లాఠీచార్ట్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రైతులు మరింత రెచ్చిపోయారు. ట్రాక్టర్లను పోలీసులపైకి దూసుకుపోనిచ్చారు. దీంతో పోలీసులు తలో దిక్కు పరిగెత్తాల్సి వచ్చింది.
#WATCH Violence continues at ITO in central Delhi, tractors being driven by protestors deliberately try to run over police personnel pic.twitter.com/xKIrqANFP4
— ANI (@ANI) January 26, 2021
మరోవైపు ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసు వద్ద… అడ్డుగా ఉన్న బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో తొక్కించేశారు.కొన్ని చోట్ల ఆందోళనకారులను అడ్డుకునేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులను అడ్డుగా పెట్టగా.. ఆందోళనకారులు వాటిని ధ్వంసం చేశారు. కొన్నిచోట్ల ట్రాక్టర్లతోనే పక్కకు తోసేశారు.కొన్ని చోట్ల పోలీసులు ఆందోళనకారులను తరుముతోంటే..మరికొన్ని చోట్ల పోలీసులనే రైతులు దాడి చేస్తున్నారు. దీంతో పరేడ్ మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
#WATCH Protesting farmers reach ITO, break police barricades placed opposite Delhi Police headquarters #FarmLaws #RepublicDay pic.twitter.com/F9HPrNNZF4
— ANI (@ANI) January 26, 2021
ఇప్పటికే ఆందోళనకారులు సెంట్రల్ ఢిల్లీలోకి ప్రవేశించడంతో.. .వారిని ఇండియా గేట్, రాజ్‌పథ్, రాజ్‌ఘాట్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
#WATCH Protesters break barricade, attack police personnel and vandalise police vehicle at ITO in central Delhi pic.twitter.com/1ARRUX6I8E
— ANI (@ANI) January 26, 2021