మంత్రి కొడాలి, మాజీ మంత్రి దేవినేని ఉమ సవాళ్లు, ప్రతిసవాళ్లతో బెజవాడలో హైటెన్షన్ నెలకొంది. గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరనసనకు సిద్దమైన దేవినేనిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. గొల్లపూడిలో ఎలాంటి రాజకీయ కార్యక్రమానికి అనుమతి లేదన్న పోలీసులు.. దేవినేని ఉమను బలవంతంతగా అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌పై విమర్శలు చేస్తే తమ చేతుల్లో దెబ్బలు తినక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనకు సిద్ధమయ్యారు దేవినేని. కొడాలి నానికి దమ్ముంటే తనను టచ్ చేసి చూడాలంటూ సవాల్ విసిరారు.మరోవైపు దేవినేని నిరసనకు బయల్దేరిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.