రాబోయే 8 రోజులు దేశానికి ఎంతో కీలకం, దేశ ప్రగతిని మార్చే నాలుగు తీర్పులు రానున్నాయి, దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న కీలక కేసులు ఒక కొలిక్కి రానున్నాయి. పరిష్కారం లేకుండా వివాదాలతో నానుతూ వస్తున్న కొన్ని కేసులలో ఎట్టకేలకు తీర్పు రాబోతుంది.యావత్ దేశ ప్రజలు ఎదురుచూస్తున్న కేసులలో తీర్పులు సైతం ఈ వారం రానున్నాయి. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గొగోయ్ తీర్పులను వెల్లడించనున్నారు.
గత కొన్నేళ్లుగా వివాదాలకు కేంద్రబిందువు అయిన అయోధ్య లో రామమందిరం నిర్మాణం పై సుప్రీం ఏంచెప్పబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ తరువాత తీర్పు రానుంది. అయోధ్య పై సుప్రీం తీర్పుపై దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచిస్తుంది.
1934 లో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది, మసీదు పాక్షికంగా ద్వంసం అయ్యింది, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హిందువుల దగ్గరనుంచి సొమ్మును వసూలు చేసి మసీదు ను తిరిగినిర్మించారు. 1950 లో బాబ్రీ మసీదులో రాముడి విగ్రహాలు ప్రతిష్టించి పూజించే అవకాశం ఇవ్వాలని గోపాల్ సింగ్ విశారద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 7 దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కేసులో కూడా ఈ వారమే తీర్పు రానుంది.
ఇక దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమస్య మహిళలకు శబరిమలై ప్రవేశం. శబరిమలై అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గత ఫిబ్రవరిలో కోర్టు తీర్పు చెప్పింది. దాంతో పెద్దఎత్తున అల్లర్లు జరిగాయి, ఆ తీర్పు పై రివ్యూ పిటిషన్ దాఖలైంది, విచారణ పూర్తయిన ఈ కేసులో కూడా ఇదే వారం తీర్పు రానుంది.
ఇక రాజకీయ దుమారం లేపిన రఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు కుంభకోణం కేసు విషయంలో సీబీఐ డైరెక్టర్ల మధ్య వివాదం పై కూడా ఇదే వారం తీర్పు రానుంది. ఈ వారం రోజులు అత్యున్నత ధర్మాసనం ఇచ్చే తీర్పులపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని కేసులను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసలాతో అడుకుంటున్నాయి. ఈ వారం సుప్రీం తీర్పుతో వీటన్నింటికి చెక్ పడుతుందని అందరు ఆశిస్తున్నారు.