ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ బర్త్ డే వేడుకల్ని వ్యతిరేకిస్తూ.. హాస్టల్ దగ్గర బహుజన విద్యార్థులు నిరసన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.
విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనం ఎక్కిస్తుండగా.. టీఆర్ఎస్వీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. పెద్ద పెద్ద కర్రలతో వచ్చి బహుజన విద్యార్థులపై దాడికి ప్రయత్నించారు.
ఈ ఘటనపై ఓయూ నిరుద్యోగ నాయకుడు చనగాని దయాకర్ స్పందించారు. వీసీని హెచ్చరిస్తూ.. ఓయూకు గులాబీ రంగు వేసుకోండని మండిపడ్డారు. బహుజన సంఘాల నేతలపై టీఆర్ఎస్ గూండాల దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఇటు ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసీఆర్ జన్మదినాన్ని బ్లాక్ డేగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తెలిపారు. కేసీఆర్ బర్త్ డే వేడుకల్ని అడ్డుకుంటున్నామని చెప్పడంతో.. పోలీసులు సురేష్ ను అరెస్ట్ చేశారు.