అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ సోషల్ మీడియా పోస్టుతో మొదలైన వివాదం ఇప్పుడు జేసీ వర్సెస్ పెద్దారెడ్డి వర్గీయుల దాడి వరకు వెళ్లింది. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి… జేసీ వర్గీయులపై దాడి చేయగా, జేసీ కూర్చీలో కూర్చోటంతో ఆయన వర్గీయులు భగ్గుమన్నారు.
సంఘటన సమయంలో ఇంట్లో లేని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు… హుటాహుటిన అక్కడకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జేసీ కూర్చిలో పెద్దారెడ్డి కూర్చున్నారని తెలిసి ఆ కుర్చీని జేసీ వర్గీయులు తగలబెట్టారు. దీంతో ఇరు వర్గాలు మరింత రెచ్చిపోకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మొహరించారు. తాడిపత్రిలో 144సెక్షన్ విధించారు.