ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా తెలంగాణ బంద్‌తో డిపోలకే బస్సు లు పరిమితం అయ్యాయి. నగరంలోని ఉప్పల్ డిపో వద్ద బస్సులు, ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్షాలు అడ్డుకున్నారు. బస్సులను అడ్డుకుంటున్న వాళ్ళని పోలీస్ లు ఎక్కడిక్కక్కడే అరెస్ట్‌లు చేస్తున్నారు. అన్ని డిపోల వద్ద పోలీస్ బలగాలు మోహరించాయి.
కడుపుకోతతో న్యాయపరమైన డిమాండ్ల సాధనకు పోరాడుతుంటే కేసీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరెస్ట్ లు చేయిస్తున్నారని అఖిలపక్షాల నాయకులు, ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ మీద బయిటాయించిన నాయకులను, కార్మికులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ లు చేస్తున్నారు. తమ డిమాండ్లను వెంటనే తీర్చాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.