మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కేంద్రమంత్రి నారాయణ్ రాణెను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనపై మూడు ఎఫ్ఐఆర్ లు నమోదవ్వడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
కొంకణ్ లో జన ఆశీర్వాద్ యాత్రలో పాల్గొన్నారు నారాయణ్ రాణె. అక్కడే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన భోజనం చేస్తున్నారు. అభిమానులు పోలీసులను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.
అరెస్ట్ ను ముందే గ్రహించిన కేంద్రమంత్రి రత్నగిరి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వెంటనే విచారణకు నో చెప్పింది న్యాయస్థానం. బెయిల్ పిటిషన్ రద్దయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేశారు.