జ్వరాలు లేవని అబద్దం చెప్తారా?
మీకు లెక్కలు రావా?
మాకు కావాలని అబద్దం చెప్తున్నారు?
మీడియా లో వస్తున్నా వార్తలు అయినా చూడడం లేదా?
విశ్వానగరం లోనే ఇంత అధ్వాన్నంగా ఉంటే, జిల్లాల పరిస్థితి ఏంటి?
జ్వరాలు లేవు ఏమి లేవు అంటూ చెప్పుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు కాస్త గట్టిగానే మొట్టికాయలు వేసింది. సెప్టెంబర్ 7 తేదీ వరకు ఒక్కరు కూడా డెంగీ వాళ్ళ చనిపోలేదన్న హెల్త్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ని హై కోర్టు తప్పు పట్టింది. ‘డెంగీ, వైరల్ జ్వరాల కు సంబంధించి అయితే మీరు కావాలని తప్పుడు రిపోర్ట్ లు కోర్టు కి ఇస్తున్నారు, లేదా…రిపోర్ట్ లను మర్చి ఇస్తున్నారు’ అంటూ కాస్త ఘాటుగా స్పందించింది. మీడియా లో వస్తున్నా వార్త లకి డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్ లకి అస్సలు సంబంధం లేకుండా ఉందని హై కోర్టు గుర్తుచేసింది.
చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్, ఏ అభిషేక్ రెడ్డి హెల్త్ డిపార్ట్మెంట్, GHMC అధికారులు ఇచ్చిన రిపోర్టులను కోర్టు తప్పుబట్టింది. గడిచిన వారం రోజుల్లోనే 1,120 మంది జ్వరాల బారినపడ్డారని, అది మీకు దారుణం అనిపించడం లేదా అని గట్టిగా ప్రశ్నించారు. ఖంగుతున్న అధికారులు ‘ప్రతి ఏడాది విష జ్వరాల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోందని’ ఒప్పుకున్నారు.
రాజధాని నగరం లోనే ఇలా ఉంటే జిల్లాల్లో ఇంకెంత అధ్వాన్నంగా ఉందో అని డివిజన్ బెంచ్ చేసిన వ్యాఖ్యకి అధికారులు మౌనంగా నుంచున్నారు.
ఇది ఇలా ఉండగా, మంత్రి KTR ఒక ఛాలెంజ్‌ను ట్విట్టర్‌లో మొదలుపెట్టి నవ్వులు పాలయ్యారు.
మీ ఇంట్లో నిలువ నీళ్లు ఉంటే క్లీన్ చెయ్యండి అంటూ నగరవాసులకు ఛాలెంజ్ విసిరారు. దానికి కొందరు ‘విష జ్వరాలు నగరాన్ని తినేస్తోంటే ఏంటి ఈ ఆటలు’ అంటూ సూటిగా ఆయనకే ప్రశ్నలు సంధించారు. మరో పక్క, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కెమెరా ముందు ఇంటర్వ్యూ ఇస్తూ దోమల మందు కొడుతున్న ప్రహసనాన్ని కూడా జనం విపరీతంగా తప్పుపట్టారు.
Advertisements