శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం లవ్ స్టోరీ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవి నటించింది. అయితే ఈ రొమాంటిక్ లవ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమా యూఎస్ ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అక్కడి సమాచారం ప్రకారం…లవ్ స్టోరీ కి యూఎస్ లో 226 ప్రదేశాలలో ప్రీమియర్ కాగా… $306,795 (రూ.2.26 కోట్లు) వసూలు చేసిందట. 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి భారతీయ సినిమా ప్రీమియర్‌గా లవ్ స్టోరీ నిలవడం విశేషం.