కొన్ని సినిమాలు ఎన్నిసార్లు టివీల్లో వచ్చినా జనాలు అంతే ఇంట్రస్ట్ తో చూస్తారు. సినిమాలోని కంటెంట్ నచ్చితే చాలు చిన్న హీరోనా పెద్ద హీరోనా అనే తేడా లేకుండా ఆదరిస్తుంటారు. అలా టివీల్లో వచ్చిన ప్రతిసారీ ఎక్కువ TRP తెచ్చుకున్న 5 డబ్బింగ్ సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం!
1.రోబో
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా రోబో.! జెమినిలో టెలికాస్ట్ అయిన ఈ మూవీ 19.4 TRP తో డబ్బింగ్ సినిమాలలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
2. బిచ్చగాడు
ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజై దాదాపు 15 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసిన బిచ్చగాడు సినిమా . … తెలుగులో బుల్లితెరపై కూడా రికార్డ్ స్థాయిలో 18. 76 TRP రేటింగ్ తో ఈ జాబితాలో 2 వ స్థానంలో నిలిచింది
3. కబాలి
ప్లాఫ్ టాక్ తో కూడా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ క్రియేట్ చేసిన కబాలి సినిమా .TRP విషయంలో కూడా మంచి రేటింగ్ తెచ్చుకుంది . కబాలి టీవీలో ప్రసరమైనప్పుడు 14.52 TRP రేటింగ్ తో 3 వ స్థానంలో ఉంది .
4. కాంచన
రాఘవ లారెన్స్ ఒక కొరియోగ్రాఫ్ , నటుడుగానే కాదు , దర్శకుడిగా కూడా ఎన్నో అధ్బుతమైన సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సినిమా కాంచన 3 టీవీలో ప్రసరమైనప్పుడు 13.1 TRP రేటింగ్ సాధించి , ఈ జాబితాలో 4 వ స్ధానంలో నిలిచింది .
5. KGF
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన సినిమా KGF . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజై బాహుబలి తర్వాత మన సౌత్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది . ఈ సినిమా టీవీలో ప్రసరమైనప్పుడు తెలుగులో 11.9 TRP తో ఈ లిస్టులో 5 వ స్థానంలో నిలిచింది ఈ సినిమా .