– ప్రియాంక గాంధీ వాద్రా..
కర్ణాటకలో హిజాబ్ వివాదం ఉద్రిక్తం అవుతున్నది. ఇలాంటి నేపథ్యంలో మహిళల వస్త్రధారణపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. మహిళలు ఏ దుస్తులు వేసుకోవాలన్నది వారి ఇష్టమని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఇది మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఆమె ట్వీట్ లో తెలిపారు.
‘ అది బికినీ కానీ, ఘూంఘట్(ముసుగు) లేదా జీన్స్, హిజాబ్ ఏదైనా కానీ ఏం ధరించాలన్నది పూర్తిగా మహిళల ఛాయిస్. వారు తమకు నచ్చిన వస్త్రాలు ధరించే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. ఈ విషయంలో వాదనలు ఆపండి. వారిని వేధించడం ఆపివేయండి” అంటూ ట్విట్ చేశారు.
ఆమె వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న వివాదం ఏంటి.. ఇందులో జీన్స్, బికినీలను ఎందుకు తీసుకువస్తున్నారంటూ ప్రియాంక వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చ పేరుతో హద్దులు దాటడం ఎంత వరకు సమర్థనీయమో తెలిపాలంటూ పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇక కర్నాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ వివాదం అగ్గి రాజేస్తోంది. ఇప్పటికే రెండు వర్గాల మధ్య నెలకొన్న గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు మూడు రోజుల పాటు సెలవులను ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.