తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రోజురోజుకి తనలోని కొత్త టాలెంట్లను అందరికీ పరిచయం చేస్తున్నాడు. చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు. తాజాగా హిమాన్షు తనలోని మరో టాలెంట్ ను ప్రజల ముందుకు తీసుకుని వచ్చాడు. తాత కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఓ ఇంగ్లీష్ పాటను పాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
కుమారుడు పాడిన పాటను విని కేటీఆర్ ఆనందానికి అవధులు లేవు. హిమాన్షు పాడిన పాట తనకు ఎంతో గర్వంగా ఉందని కితాబిచ్చారు. ఎంతో సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. ఈ పాటను నేను ఎంతో ఇష్టపడ్డాను, మీరూ లైక్ చేయాలని కోరుతూ ఆ పాట యూట్యూబ్ లింక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు కేటీఆర్. కొడుకు పాట విని మురిసిపోయిన కేటీఆర్.. ‘ప్రౌడ్ అండ్ ఎగ్జైటడ్ ఫర్ మై సన్’ అని కామెంట్ చేశారు కేటీఆర్.
దీనిపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. అల్లుడూ.. నువ్వు సూపర్, అదరగొట్టేశావ్ అంటూ హిమాన్షుని మెచ్చుకున్నారు కవిత. తన మేనల్లుడు పాడిన పాట అదుర్స్ అంటూ ఆమె ట్వీట్ చేశారు. తన అల్లుడు కల్వకుంట్ల హిమాన్షు పాడిన పాట తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యు అంటూ తన అల్లుడిని దీవించారు కవిత.
‘అల్లూడు నీ పాట బాగుంది. నిన్ను చూసి గర్వపడుతున్నా. నీ నుంచి ఇలాంటి అందమైన సంగీతం వినడానికి వేచి ఉన్నా’ అని ట్వీట్ చేశారు కవిత.‘గోల్డెన్ అవర్’ పాటను పాడింది అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్. అదే సాంగ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు అద్భుతంగా ఆలపించాడు. ఈ ఇంగ్లిష్ సాంగ్ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు ఆమోఘంగా ఉందంటున్నారు అంతా. అచ్చం జాకబ్ లాసన్‌ను తలపించేలా హిమాన్షు ఈ కవర్ సాంగ్ పాడాడని మెచ్చుకుంటున్నారు.
ఈ పాటకు సంబంధించిన వీడియోను హిమాన్షురావు ‘గోల్డెన్ అవర్ X హిమాన్షు కవర్’ పేరుతో తన యూట్యూబ్‌లో ఛానెల్‌లో షేర్ చేశారు. ఈ సాంగ్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
A beautiful and soothing euphony ❤️
So proud of you alludu @TheRealHimanshu , already waiting to hear more beautiful music by you. God bless you !! https://t.co/9PqqApnlJF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2023