భారీ వర్షాలకు హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 6 గేట్లను ఎత్తారు అధికారులు. దీంతో మూసీ నదిలో వరద ప్రవాహం పెరిగింది. దాదాపు 10 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు అధికారులు.
చాదర్ ఘాట్, అంబర్ పేట, ముసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూసారాంబాగ్ వంతెనతో పాటు చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జిపైకి రాకపోకలను నిలిపివేశారు.
మరోవైపు గులాబ్ తుపాను ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై తగ్గిందని అంటోంది వాతావరణశాఖ. ప్రస్తుతం తుపాను తీవ్ర అల్పపీడనంగా ఉందని విదర్భ, మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇంకో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.