జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం దేశ వ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి.ఐటీబీపీ సైనికులు కూడా ఇందుకు సిద్ధమవుతున్నారు.ఉత్తరాఖండ్లో 15,000 అడుగుల ఎత్తులో హిమ్వీర్స్ యోగా సాధన చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరాఖండ్లో ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసులు యోగా సెషన్ నిర్వహించారు.ఐటీబీపీకి చెందిన హిమవీర్స్ 15 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మంచు కురుస్తుండగానే యోగా చేశారు.అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు నిర్వహించిన ఈ యోగా సెషన్లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకోవటంపై ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 ఐక్య రాజ్య సమితి ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు.
భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్నఅమెరికా , ఇంగ్లాండ్ ,చైనా ,ఫ్రాన్స్ ,రష్యా వంటి దేశాలు సహ ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014లో ఆమోదించారు.