హిందీ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇళంగోవన్ వార్తల్లో నిలిచారు. హిందీ భాషను ప్రవేశ పెడితే తమిళులు శూద్రులుగా మారతారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
హిందీ భాషను కేవలం బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, లాంటి అభివృద్ది చెందని రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే మాట్లాడుతారని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు , కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కావా? అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాల ప్రజల మాతృభాష హిందీ కాదని ఆయన అన్నారు.
హిందీ భాష మనల్ని శూద్రులుగా మారుస్తుందన్నారు. ఇది మనకు మంచిది కాదన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.