చెన్నై: దేశ ప్రజలకు ఉమ్మడి అనుసంధాన భాషగా హిందీ అభివృద్ధి చెందాలని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా ఆగలేదు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ దీనిపై ఘాటుగా స్పందించారు. ఉమ్మడి భాష మన దేశానికి మంచిదే..! అయితే ఏ భాషనూ, ప్రత్యేకంగా హిందీని బలవంతంగా ప్రజలపై రుద్దకూడదని రజనీకాంత్ చెప్పారు.
హిందీని బలవంతంగా రుద్దడాన్ని తమిళనాడుతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమూ ఆమోదించదని రజనీకాంత్ ప్రకటించారు. ఉత్తరాది రాష్ట్రాలు కూడా హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తాయన్నారు. ఉమ్మడి భాష దేశ సమైక్యతకు, అభివృద్ధికి మంచిదేనని రజనీకాంత్ అభిప్రాయ పడ్డారు. అయితే భాషను బలవంతంగా రుద్దడం ఆమోదయోగ్యం కాదన్నారు.