నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రం థియేటర్స్ లో దుమ్ము దులుపుతూ… మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ సన్నివేశం విషయంలో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ సీన్ ఏంటంటే పూజ గదిలో లక్ష్మీదేవి తోపాటు జీసస్ ఫోటో పెట్టారు శేఖర్ కమ్ముల.
ఇది సరైనది కాదని. పూజగదిలో జీసస్ ఫొటో ఎలా పెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలానే చర్చి లో మసీదులో చేయగలరా అంటూ ప్రశ్నించారు. ప్రతి సినిమాలోనూ ఇదే విధంగా హిందూ దేవుళ్ళను అవమానిస్తున్నారని చిన్నచూపు చూస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నారు.