యూపీ బీజేపీ నేత, ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్ని్కల్లో తనకు ఓటు వేయని హిందువులకు వారి నరాల్లో ముస్లింల రక్తం ఉన్నట్టేనని అన్నారు.
దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోలో వివరాల ప్రకారం.. యూపీలోని దొమరియా గంజ్ నియోజకవర్గంలో బహిరంగ సభకు ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గ్రామంలో ఎవరైనా హిందువు ఇతరులకు ఓటు వేస్తే , అతని నరాల్లో ముస్లింల రక్తం ప్రవహిస్తున్నట్టేనని అన్నారు. ఆ హిందువు ఒక ద్రోహి అని, అలాంటి వాళ్లు వాళ్ల తల్లిదండ్రులకు అక్రమ సంతానం అని మాట్లాడారు.
‘ చాలా దాడులు జరిగిన తర్వాత కూడా ఒక వేళ హిందువు అవతలి పక్షం వెళితే అతన్ని బహిరంగంగా తన ముఖం చూపించనివ్వకూడదు. నేను ఐదేండ్ల పాటు మంత్రి అవుతాను. అప్పుడు చూస్తాను. ఇంత హెచ్చరించిన తర్వాత కూడా మీరు అర్థం చేసుకోపోతే రాఘవేంద్ర సింగ్ అంటే ఏంటో నేను చూపిస్తాను” అన్నారు.
Advertisements
అయితే దీనిపై ఎమ్మెల్యేను మీడియా ప్రశ్నించగా… తాను వేరే సందర్భంలో ఆలా మాట్లాడానని, అది ఉదాహరణగా మాత్రమే చెప్పానని అన్నారు. ‘ ఎలక్టోరేట్ లో 38 శాతం (1.73 లక్షల మంది) ముస్లింలు ఉన్న దొమారియాగంజ్ లో బెదిరించి ఎవరైనా గెలవగలరా అని ప్రశ్నించారు.