ప్రతి హిందువూ నలుగురు పిల్లలను కనాలని సాద్వీ రితాంబర అన్నారు. ఉత్తరప్రదేశ్ లో విహెచ్ పీ ఆధ్వర్యంలో నిర్వహించిన రామోత్సవ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ….. ప్రతి హిందువు ఇద్దరికి బదులుగా నలుగురు పిల్లలను కనాలన్నారు. వారిలో ఇద్దరిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్( వీహెచ్ పీలకు) అప్పగించాలన్నారు.
తద్వారా వారు జాతీయ యాగానికి సహకరించగలరని ఆమె అన్నారు. అదే సమయంలో మరో ఇద్దరు సమాజం కోసం జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు శ్రీ రాముడి వేషదారణలో హాజరయ్యారు.
దేశంలోని రాజకీయ పార్టీలు హిందువులను విభజించాయని తెలిపారు. అయితే శ్రీరాముడి ప్రవర్తన మొత్తం ఏకం చేస్తుందని అన్నారు. అంతకు ముందు మహంత్ యతి నరసింహానంద కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.