మధ్యప్రదేశ్ పోలీసులను మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ కమల్ నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల తర్వాత అందరి లెక్కలు సరిచేస్తానంటూ పోలీసులపై ఫైర్ అయ్యారు. మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
బహిరంగ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ… మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని గుర్తు చేశారు. దూకుడు, భయాందోళనలకు గురికావద్దని అందరికీ తాను చెప్పాలని అనుకుంటున్నానన్నారు. తాను చెప్పేది పోలీసులంతా చెవులు విప్పి వినాలన్నారు.
రాబోయే ఎన్నికల్లో అందరి ఖాతాలు సరిచేస్తామన్నారు. రాష్ట్రంలో అధికార బీజేపీ పక్షాన పోలీసులు, అధికార యంత్రాంగం వ్యవహరిస్తుండంపై ఆయన ఈ మేరకు హెచ్చరించారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.
బెదిరింపు, ప్రతీకారం, ప్రతీకార రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని తెలియజేస్తోందంటూ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించవచ్చన్నారు.