• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

దీపావళి పండగ విశిష్టత ఇదే…!

Published on : October 27, 2019 at 5:45 am

భారతదేశంలో అనాదిగా ఆచారించుచున్న పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి పండుగను ఆశ్వయిజ మాసంలో అమావాస్య నాడు జరపుకుంటారు.

దీపావళి అనగా దీపముల వరుస, దీపముల సముహం అని అర్థం

ద్వాపర యుగంలో శ్రీమహవిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించి… ఆ కాలంలో దేవ,ముని, గణ, సాదు, సజ్జనులను హింసించుచున్న నరకుడు అనే రాక్షసున్ని తన బార్య అయిన సత్యభామతో కలిసి సంహరించాడు. నరకున్ని సంహరించిన రోజున నరకచతుర్ధశిగా, ఆ తదుపరి దినం అనగా అమవాస్య నాడు దీపములను వెలిగించి లక్ష్మినారాయణను పూజించటమే దీపావళి అమావాస్య.

దీపావళి రోజున ఉదయాన్నే లేచి… నువ్వుల నూనేతో అభ్యంగన స్నానం ఆచరించి, గృహములను పూలతో, తోరణాలతో అలంకరించి… ముగ్గులు వేసి, సాయంకాలంన సంధ్యాసమయంన దీపములు వెలిగించి… మహలక్ష్మి దేవీని ఆరాధించి, బాణాసంచ వెలిగించి ఆనందించు పండగ దీపావళి. ఈ పండుగ ప్రాముఖ్యం అంతా మహలక్ష్మిని ఆరాదించుట, కొలుచుట, పూజించుట అని గ్రహించవలెను.

పంచభూతములలో అగ్ని ప్రధానమైనది. అగ్నిలో తేజస్సు, ఆహరం, విద్య నిండి ఉంటాయి. అందుచే… అగ్నికి హిందు సంప్రాదాయాల్లో. . అంత ప్రాధాన్యం ఉంది. దీపములో… మూడు రంగులు కలిసి ఉంటాయి. అవి నీలము, తెలుపు, పసుపు. ఇవి సత్వ, రజో, తమో గుణాలకు సంకేతం. మరియు… లక్ష్మి, సరస్వతీ, దుర్గలకు కూడా ప్రతీకలు. ఈ దీపాన్ని ఆరాదించుట త్రిజగన్మాతలను ఆరాధించటమే.

దీప విశిష్టతను వివరిస్తూ… శ్రీ మహ విష్ణువు ఇంద్రునికి చెప్పిన ఈ శ్లోకము దీపమహత్యమును తెలుపుతుంది.

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదం
శత్రువృద్ధి వినాశాయ దీపంజ్యోతి నమోస్తుతే…
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్థనః
దీపోహరతి పాపాని సంద్యాదీప నమోస్థుతే!

ఈ దీపావళి రోజున ఉత్తర భారతదేశంలో నూతన సంవత్సరంగా… భావించి, కొత్త ఖాతాలు, పుస్తకాలు తెరిచి వ్యాపారంబం చేయు ఆచారం ఉంది.

స్టాక్‌ మార్కేట్ కూడా దీపావళి రోజున ముహరత్ ట్రేడింగ్ పేరున ఒక గంట ప్రత్యేక ట్రేడింగ్ చేస్తుంది. ఇట్టి మహ మహిమాన్వితమైన ఈ పండుగ హిందువులకు చాలా ముఖ్యమైనది, శుభమైనది.

ఈ దీపావళి పండుగకు కారణమైన నరకాసురుడి వధ భాగవతంలో వివరింపబడింది. నరకుడు భూపుత్రుడు. కృతయుగంలో వరహమూర్తికి, భూదేవికీ పుట్టిన మహబలశాలి. తన తల్లి వల్ల తప్పా… వేరే ఎవరి చేత మరణం సంభవించకుండా వరం పొందిన వాడు. అతని ఆగడాలను నివారింపడానికి శ్రీకృష్ణుడు భూదేవి అంశలో జన్మించిన సత్యభామతో కలిసి వెళ్లి నరకాసరుని సంహరించారు. ఆ శుభ సందర్భంగా సకల లోకాలలో మహలక్ష్మి స్వరూపమైన దీపాలను వెలిగించి పండుగ చేసుకున్నారు. అదే ఆనందమయ దీపావళి పండుగ.

దీపావళి నాడు దీపంలోనే లక్ష్మిదేవిని ఆవాహనం చేసి పూజించాలి. అలక్ష్మిని పంపేయడానికి డక్కాలు వాయించటం, దివీటీలు వెలిగించటం, టపాసులు పేల్చి చప్పుడు చేయటం ఆచారమైంది. దీనినే అలక్ష్మి నిస్సరణం అంటారు.

ముఖ్యంగా ఇంతకు ముందు బుతువైన వర్షాకాలంలో పుట్టిన క్రిమికీటకాదులు దేవతాహ్వనం చేయబడిన ఈ దీపాదులు, బాణాసంచాదుల్లో పడి జన్మ నుండి విముక్తిని పొంది ఉత్తర జన్మలకు వెళ్తాయి. అంతేకానీ లేనిపోని ఆడంబరాలు, లేక వాతావరణ కాలుష్యం కోసం కాదు.

ఇంత గొప్ప సంప్రదాయం మనది.

అందరికీ మహ లక్ష్మీ అనుగ్రహాపూర్వక దీపావళి శుభాకాంక్షలు.

—-ప్రసాద్ శర్మ, పురోహితులు.

tolivelugu app download

Filed Under: బిగ్ స్టోరీ

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సంక్రాంతి స్పెషల్...పవన్ మరో సినిమా అప్డేట్

సంక్రాంతి స్పెషల్…పవన్ మరో సినిమా అప్డేట్

ప్ర‌భాస్- కేజీఎఫ్ య‌ష్ ఫోటోస్- స‌లార్ పూజ కార్య‌క్ర‌మంలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్

ప్ర‌భాస్- కేజీఎఫ్ య‌ష్ ఫోటోస్- స‌లార్ పూజ కార్య‌క్ర‌మంలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్

తొలిరోజు రామ్ రెడ్ మూవీ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా

తొలిరోజు రామ్ రెడ్ మూవీ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా

రాధేశ్యామ్ యూనిట్ కు ప్ర‌భాస్ సూప‌ర్ స‌ర్ ప్రైజ్

రాధేశ్యామ్ యూనిట్ కు ప్ర‌భాస్ సూప‌ర్ స‌ర్ ప్రైజ్

అభిజిత్ ను సర్ ప్రైజ్ చేసిన రోహిత్ శర్మ

అభిజిత్ ను సర్ ప్రైజ్ చేసిన రోహిత్ శర్మ

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

తెలంగాణలో ఎక్కడెక్కడ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారంటే....

తెలంగాణలో ఎక్కడెక్కడ కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారంటే….

దేవాల‌యాల దాడుల్లో రాజ‌కీయ నేత‌ల హ‌స్తం

దేవాల‌యాల దాడుల్లో రాజ‌కీయ నేత‌ల హ‌స్తం

జ‌న‌వ‌రి 19న మ‌రోసారి కేంద్రం-రైతు సంఘాల చ‌ర్చ‌లు

జ‌న‌వ‌రి 19న మ‌రోసారి కేంద్రం-రైతు సంఘాల చ‌ర్చ‌లు

జ‌క్రాన్ ప‌ల్లి ఎంపీడీవో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

జ‌క్రాన్ ప‌ల్లి ఎంపీడీవో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

అంబానీ, అదానీల కోస‌మే ఈ చ‌ట్టం- రాహుల్ గాంధీ

అంబానీ, అదానీల కోస‌మే ఈ చ‌ట్టం- రాహుల్ గాంధీ

తీరు మార్చుకోని ఆసీస్- మ‌ళ్లీ జాత్య‌హంకార వ్యాఖ్య‌లు

తీరు మార్చుకోని ఆసీస్- మ‌ళ్లీ జాత్య‌హంకార వ్యాఖ్య‌లు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)