హీరో అడివి శేష్ మరోసారి తన మార్క్ చూపించాడు. మేజర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ హీరో, ఇప్పుడు HIT2 సినిమాతో మరో సక్సెస్ సాధించాడు. ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే, మేజర్ కంటే పెద్ద సక్సెస్ HIT2. విడుదలైన 2 రోజుల్లో సినిమాకు ఏకంగా వరల్డ్ వైడ్ 20 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. షేర్ లెక్కలో చూసుకుంటే ఇది 11 కోట్లు.
తాజా వసూళ్లతో HIT2 సినిమా 73 శాతం రికవరీ సాధించింది. ఈరోజు వసూళ్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం ఖాయమని తేలిపోయింది.
అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్టయింది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వబోతోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే, ఓవర్సీస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లో చేరేలా ఉంది.
శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది HIT2 సినిమా. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించగా, హీరో నాని సమర్పించాడు.