డిసెంబర్ నెలలో బోణీ కొట్టడానికి 2 సినిమాలు సిద్ధమయ్యాయి. అవే మట్టి కుస్తీ, హిట్-2 మూవీస్. టాలీవుడ్ లో డిసెంబర్ కు ఓ మంచి సెంటిమెంట్ ఉంది. హీరోలు ఎవరు అనే విషయాన్ని పక్కనపెడితే, ఏటా డిసెంబర్ లో ఓ బ్లాక్ బస్టర్ పడుతోంది. ఈ ఏడాది ఆ సెంటిమెంట్ ను ఏ సినిమా అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ముందుగా హిట్-2, మట్టికుస్తీ సినిమాలతో డిసెంబర్ బాక్సాఫీస్ మొదలుకాబోతోంది. అడివి శేష్ హీరోగా నటించిన సినిమా హిట్-2. మేజర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత శేష్ నుంచి వస్తున్న సినిమా ఇది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ కు పెట్టింది పేరైన శేష్, ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేసి తీరతాడని ట్రేడ్ భావిస్తోంది. శైలేష్ కొలను డైరక్ట్ చేసిన ఈ సినిమాకు నాని నిర్మించాడు.
ఈ సినిమాకు పోటీగా రంగంలోకి వస్తోంది మట్టి కుస్తీ. విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈ సినిమాను రవితేజ ప్రొడ్యూస్ చేశాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. నిజానికి ఈ సినిమాపై టాలీవుడ్ లో పెద్దగా బజ్ లేదు. కాకపోతే ఈమధ్య కాలంలో రవితేజ రంగంలోకి దిగి గట్టిగా ప్రమోట్ చేయడంతో హిట్-2కు పోటీగా నిలిచింది.
మరి హిట్2, మట్టి కుస్తీ సినిమాల్లో ఏది విజేతగా నిలుస్తుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమాలతో పాటు దోస్తాన్, నేనెవరు, జల్లికట్టు బసవ, మట్టి దెయ్యాలు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రధానంగా పోటీ ఈ రెండు సినిమాలపైనే ఉంది.