న్యాచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా నటిస్తూనే నిర్మాణం రంగంలోను దూకుడుగా ఉన్నారు. గతంలో “అ” సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యారు నాని. విభిన్న కథాంశంతో వచ్చిన “అ” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. విమర్శకులను సైతం మెప్పించే విదంగా కథ ఉండటంతో నాని కి మంచి ప్రశంశలు అందాయి.
ఇప్పుడు నాని రెండో ప్రయత్నంగా వస్తున్న హిట్ సినిమాతో వస్తున్నాడు. ‘ఫలక్ నుమా దాస్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన విశ్వక్‌సేన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు ‘చిలసౌ’తో హీరోయిన్‌గా పరిచయం అయిన రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రేమికుల రోజు సందర్బంగా ప్రకటించారు. ఫిబ్రవరి 28 న ఈ మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుందని తెలిపారు.