హైదరాబాద్: సైబరాబాద్ ల్యాండ్ మార్క్ హైటెక్ సిటీ. దీనికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు. 1998లో హైటెక్ సిటీ ప్రారంభించి ఐటీ అభివృద్ధికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాటలు వేసిన ఘనత చంద్రబాబు సొంతం. తెలంగాణ సర్కార్ కు ఇప్పుడు ఐటీ రంగం ద్వారా వేల కోట్ల రూపాయల రాబడికి ఆనాటి ముందుచూపే కారణం.
హైటెక్ సిటీ 21వ వార్షికోత్సవాన్ని స్థానిక ఐటీ నిపుణులు, టీడీపీ అభిమానులు ఘనంగా జరుపుకుని చంద్రబాబు సేవలు గుర్తు చేసుకున్నారు. కేక్ కట్ చేసి సైబరానందాన్ని పంచుకున్నారు. చంద్రబాబు ఆనాడు కట్టిన సైబర్ టవర్స్ విశిష్టతను నేటి తరానికి తెలియజేసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు దార్శనికత వల్లే ఐటీ రంగంలో ఇంత అభివృద్ధి సాధ్యమైందనేది వారి ఆనందోత్సవానికి కారణం.
హైటెక్ సిటీ ప్రారంభమై 20 ఏళ్లు పూర్తై 21వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు చంద్రబాబును కలిసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన కృషి వల్లే ప్రతి ఇంటి నుంచి ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వచ్చారన్నారు.