హెచ్ఎండిఏ ల్యాండ్ పార్సెల్ హాట్ కేకుల్లాగా మారాయి. వరుసగా మూడవరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 8 ల్యాండ్ పార్సెల్ ను (ఆన్ లైన్ ఈ -వేలం) ద్వారా విక్రయించేందుకు ఫ్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని బేగంపేటలోని టూరిజం హోటల్ ప్లాజాలో నిర్వహించారు.
ల్యాండ్ పార్సెల్ కొనుగోలు కోసం సుమారు వంద మంది ఔత్సాహికులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రీ బిడ్ కు హాజరయ్యారు. ఈ మేరకు సమావేశంలో ఆసక్తి కనబరిచారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు సమీపంలో ల్యాండ్ పార్సిల్స్ ఉండడంతో చాలా మంది వీటిపట్ల ఆసక్తి కనబరిచారు.
ఘట్ కేసర్ సమీపంలోని కొర్రెముల, బాచుపల్లి, కూకట్ పల్లి సమీపంలోని మూసాపేట్, గండి మైసమ్మ సమీపంలోని బౌరంపేట్, కుత్బుల్లాపూర్ సమీపంలోని సూరారం ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది(8) లాండ్ పార్సెల్ ను సొంతం చేసుకేనేందుకు వీలుగా వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను ఔత్సాహికులు అడిగి తెలుసుకున్నారు.
ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు, వారి సందేహాలకు హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారులు సవివరంగా సమాధానాలు ఇచ్చారు.