హాలీవుడ్ నటి అన్నే హెచ్చి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. లాస్ ఏంజిల్స్ లో ఆమె కారు ఓ ఇంటిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అన్నే హెచ్చికి తీవ్ర గాయాలయ్యాయి.

ఓ అపార్ట్‌మెంట్ బిల్డింగ్ గ్యారేజీకి నటి(53)కి చెందిన కారు ఢీ కొన్నది. దీంతో వెంటనే భారీగా మంటలు వ్యాపించాయి. ఘటన సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.
అన్నె హెచ్చి 90వ దశకంలో ఫేమస్ నటి. సిక్స్ డేస్, సెవన్ నైట్స్, డాన్నీ బ్రాస్కో, ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్ లాంటి చిత్రాల్లో ఆమె నటించారు. అనదర్ వరల్డ్ టీవీ షోలో కూడా ఆమె నటించారు.