దర్శకదీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా, బాహుబలి తరువాత తెరకెక్కిస్తున్న సినిమా RRR . యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలు గా వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బామ ఒలీవియా నటిస్తుంది. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, ఒలీవియా మధ్య రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట. ఎన్టీఆర్, ఒలీవియా మధ్య రొమాంటిక్ సీన్స్ అదిరిపోయే రీతిలో ఉండనున్నాయని, అంతే కాకుండా సినిమాకే హై లెట్ గా నిలుస్తాయని ఫిలింనగర్ వర్గాల్లో గుస గుసలాడుకుంటున్నారు.
ఈ సినిమా అల్లూరి సీతారామ రాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండగా, కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. మరో వైపు బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్, సముద్రఖని కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా 2020 జూన్ లో ప్రేక్షకుల ముందురానుంది.