బాలీవుడ్ పై హాలీవుడ్ భామ బాంబేసింది. అది ఎవరో కాదు క్వాంటికో సిరీస్ తో గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా. ప్రస్తుతం హాలీవుడ్ లో రాణిస్తున్న ఆమె తనకు అవకాశాలిచ్చి స్టార్డమ్ సాధించిపెట్టిన బాలీవుడ్ పైనే షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ లో తనకొచ్చిన ఆఫర్ల పట్ల సంతోషంగా లేనని, అక్కడ డర్టీ పాలిటిక్స్ ను తట్టుకోలేకే తాను హాలీవుడ్ కు వచ్చినట్టు ప్రియాంక బాంబ్ పేల్చింది. తాను ఇన్ సెక్యూర్ గా బాలీవుడ్ లో ఫీల్ కావడంతోనే అక్కడ గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ తనను ఓ మూలన పడేసిందని చెప్పింది. కొందరితో తనకు విభేదాలు రావడంతో వాళ్లు కావాలనే తనకు ఆఫర్స్ రాకుండా చేశారని కుండ బద్దలు కొట్టింది.
బాలీవుడ్ లో పాలిటిక్స్ చాలా ఎక్కువని.. అవి చేయడం తనకు చేత కాదని.. అందుకే వాటికి విసిగిపోయి.. బయటకు వచ్చేశానని ప్రియాంక చెప్పింది. వీటిని తట్టుకోలేకే బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకోవాలన్న తరుణంలోనే తనకు అంజులా ఆచార్యా ద్వారా హాలీవుడ్ లో ఛాన్స్ వచ్చిందని ప్రియాంక చెప్పింది.. దీంతో వెనక్కి తిరిగి చూడకుండా.. హాలీవుడ్ లో ముందుకు వెళుతున్నానని చెప్పింది బోల్డ్ బ్యూటీ ప్రియాంక.
అయితే క్వాంటికో సిరీస్ ద్వారా హాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ప్రియాంకా ఆ తర్వాత బేవాచ్, మ్యాట్రిక్స్, ద వైట్ టైగర్ సినిమాలలో నటించింది. త్వరలోనే సిటాడెల్ సెకండ్ షో, లవ్ ఎగైన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. ఇక సరోగసీ ద్వారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక్, నిక్ జోనస్ లు తమ పేరంటింగ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.