కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మంగళవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకల్లో భారతీయ సెలబ్రిటీలు మెరిసిపోయారు. హాజరైన సెలబ్రిటీల్లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, హెల్లీ షా, పూజా హెగ్డే, తమన్నా భాటియా, హినాఖాన్ లాంటి ప్రముఖులు ఉన్నారు.
అంతకు ముందు ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ భామ దీపికా పదుకొనే చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ నెల 28 వరకు ఈ ఫెస్టివల్ కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో మాధవన్ నటించిన రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ ప్రీమియర్ కానుంది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెండో రోజున ఇండియన్ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. మొదటి రోజు రెడ్ కార్పెట్ పై దిగిన కొన్ని ఫోటోలను కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ లో షేర్ చేశారు.
‘ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2022 ప్రారంభ సమయంలో రాత్రి రెడ్ కార్పెట్ వద్ద భారతీయ తారలు అత్యంత ప్రకాశవంతంగా మెరిసిపోయారు. బృందం పలైస్ డెస్ ఫెస్టివల్స్ లో ఐకానిక్ మెట్లను భారతీయ ప్రతినిధి బృందం ఎక్కింది. ఈరోజు 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రారంభమైన ఇండియా పెవిలియన్‌కు భారత్ సిద్ధమైంది’ అంటూ ట్వీట్ చేశారు.