పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుస సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. మరొకటి క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇంకోటి సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించేశాడు. ఇటీవల పవన్ పుట్టినరోజు సందర్భంగా క్రిష్ దర్శకత్వంలో రాబోయే సినిమా ప్రీ లుక్ విడుదల అయింది. అయితే పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటు గా కనిపించనున్నాడని సమాచారం.
ఈ సినిమాకు విరుపాక్షి అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. షూటింగ్ మొదలైన 15 రోజులకే కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ చూస్తోంది. అయితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ హైలెట్ గా ఉండనుండట. ఇందుకోసం హాలీవుడ్ నుంచి నిపుణులను తీసుకురానున్నారట. ఆక్వామెన్,స్టార్ వార్స్ VII-ది ఫోర్స్ అవేకన్స్, వార్‌క్రాఫ్ట్ వంటి చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు బెన్ లాక్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.