బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు దశకు చేరుకుంది. నేటితో యాత్రను ముగించనున్నారు. ఈ సందర్భంగా తుక్కుగూడలో భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు.
కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ విముక్తే తమ లక్ష్యమని అంటున్నారు బీజేపీ నేతలు. గులాబీ గడీలను బద్దలు కొట్టి.. కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని చెబుతున్నారు. అందులో భాగంగానే సాయంత్రం అమిత్ షా ప్రసంగం ఉంటుందని భావిస్తున్నారు.
తుక్కుగూడ బహిరంగ సభకు ముందు రామాంతపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి వెళ్తారు షా. అక్కడ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అమిత్ షా టూర్ ఇలా!
మ.2:30 – బేగంపేట విమానాశ్రయం
మ.2:55 – రామాంతపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ
సా.5:00 – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గరలోని నోవాటెల్
సా.6:25 – రింగ్ రోడ్డు మీదుగా తుక్కుగూడ చేరుకుంటారు
సా.6:30-8:00 – తుక్కుగూడ బహిరంగ సభ
రా.8:20 – శంషాబాద్ ఎయిర్‌పోర్ట్
రా.8:25 – ఢిల్లీకి తిరుగుపయనం