అశోక్ ఖేమ్కా, మోస్ట్ ట్రాన్స్ ఫర్‌డ్ ఆఫీసర్ గా పేరు పడ్డ హర్యానా కేడర్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ లో ప్రిన్పిపల్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన్ను కొత్త ప్రభుత్వం ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేసింది. ఖేమ్కా 28 ఏళ్ల సర్వీసులో ఇది 53వ ట్రాన్స్‌ఫర్. సుప్రీంకోర్టు ఆదేశాలను మరొకసారి ఉల్లంఘించారు. నిజాయితీకి దక్కిన గౌరవం అవమానం అని అశోక్ ఖేమ్కా ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. 1991 వ బ్యాచ్ కు చెందిన ఈ ఐఏఎస్ ఆఫీసర్ మార్చిలోనే స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ కు మారారు. 2012 లో హర్యానాలో సోనియాగాంధీ అల్టునికి సంబంధించిన ఓ వివాదస్పద భూమిని రద్దు చేయడంతో నిజాయితీపరుడైన ఆఫీసర్ గా ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అప్పట్లో హర్యానాలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. 53 సంవత్సరాల ఈ అధికారిని తరచుగా బదిలీలు చేస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన నిజాయితీని మెచ్చుకున్న బీజేపీ కూడా అధికారంలోకి వచ్చాక అశోక్ ఖేమ్కాను తరచుగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ముక్కు సూటిగా, నిజాయితీగా వ్యవహరించడం వల్లనే ఖేమ్కా తరచుగా ట్రాన్స్ ఫర్ అవుతుంటారని ప్రజలు చెబుతన్నారు.