వైటీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలంలో కొనసాగుతోంది. అయితే.. ఈ యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. షర్మిల ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో దుర్గసానిపల్లి గ్రామం దగ్గర గ్రామస్తులతో మాట్లాడారు.
స్థానికులతో షర్మిల మాట్లాడుతుండగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో కార్యకర్తలు పరుగులు తీశారు. షర్మిలను అనుచరులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. తర్వాత ఆమె యాత్రను కొనసాగించారు.
షర్మిల చుట్టూ ఉన్నవారు తేనేటీగలను కండువాలతో తరిమారు. వారి అప్రమత్తతతో ఆమె వాటి నుంచి తప్పించుకున్నారు. అయితే.. తేనెటీగల దాడిలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయ్యాయి.
షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండలం చండేపల్లి గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు షర్మిల.