హనీరోజ్..ప్రస్తుతం కుర్రకారుని గిలిగింతలు పెడుతున్న పేరు.ఇటీవల బాలయ్యబాబు హీరోగా సంక్రాంతి బరిలోకి వచ్చిన వీరసింహారెడ్డి చిత్రంలో సెకెండ్ హీరోయిన్ రోల్ చేసి అలరించింది. మీనాక్షి పాత్రలో ఓ వైపు అదంతో కట్టిపడేస్తూనే..మరోవైపు పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కేరళ కుట్టి తాజాగా వీరసింహారెడ్డి విజయోత్సవ కార్యక్రమానికి హాజరయ్యింది. వైలెట్ కలర్ డ్రెస్‌లో స్టైలిష్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
పాలనురుగలాంటి స్కిన్ టోన్ ఉన్న హనీరోజ్ , వైలెట్ కలర్ డ్రస్ లో మరింత అందంగా మెరిసిపోయింది. కళ్ళుతిప్పుకోలేని లుక్ తో అందర్నీ కట్టిపడేసింది. హనీరోజ్ స్టిల్స్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈవెంట్‌లో డైరెక్టర్ గోపీచంద్ మలినేనితోపాటు నటీనటులు, సాంకేతి నిపుణులు, ఇతర టీం మెంబర్స్ పాల్గొన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచి కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ చిత్రంలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా కన్నడ యాక్టర్ దునియా విజయ్ కనిపించగా.. అతని భార్య భానుమతి ప్రతాప్ రెడ్డిగా వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. పీ రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Gorgeous #HoneyRose at the Veera Mass Blockbuster Celebrations 💥💥
Watch వీరసింహుని విజయోత్సవం Live Now!
– https://t.co/OYdts1a9tU#BlockBusterVeeraSimhaReddy
Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @shreyasgroup pic.twitter.com/S8ltXA3S1H
— Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2023