ఔరంగాబాద్ కు చెందిన అమ్రేష్ అనే రైతు ఒక పంట మీద 80 లక్షల లాభాన్ని గడించాడు. వారణాసి కృషి వైజ్ఞానిక డాక్టర్ లాల్ సలహా మేరకు హోప్ షాట్స్ ( చేదుకొండితీగ) అనే పంటను తనకున్న 5 ఎకరాల్లో పండించాడు.
ఈ హోప్ షాట్స్ కు యూరప్ లో మంచి డిమాండ్ ఉంది! ఈ పండ్లను ఔషదాల తయారీకి ఉపయోగిస్తారు. వీటి పూలతో బీర్లను కూడా తయారు చేయడం విశేసం, టిబి రోగాన్ని నయం చేసే మందుగా, యాంటీబయాటిక్స్ గా వీటిని ఉపయోగిస్తుంటారు. చర్మంపై ముడతలు పోయి నిగారింపు కోసం కూడా వీటిని ఉపయోగిస్తారట! ఈ పంటతో పెట్టే పచ్చళ్లకు కూడా విలువ ఎక్కువ!