యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కన్వర్ యాత్రకు వెళుతున్న యాత్రికులను ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.
ప్రమాదం గురించి ఏడీజీ రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ.. భక్తులు కన్వర్ యాత్ర కోసం వెళుతున్నారు. వీరంతా హరిద్వార్ నుంచి గ్వాలియర్ కు వెళుతున్నారు.
తెల్లవారు జామున 2గంటల 15 నిమిషాలకు హత్రాస్ లోని సదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వారిని ట్రక్కు ఢీ కొట్టింది. దీంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను ఆస్పత్రిలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.